1. గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుండి ప్రసరిస్తున్న ప్రకాశవంతమైన కాంతి స్థూపాన్ని, గయా హృదయంలోకి మీ శరీరం గుండా వెళుతున్నట్టు విజువలైజ్ చేయండి.
ఇప్పుడు మీ శరీరము ద్వారా భూమి యొక్క కేంద్రం నుంచి పైకి వెళ్లే మరో ఇతర కాంతి స్తంభము ఊహిస్తూ, మన సౌర వ్యవస్థలోని కాంతి బిందువుల ద్వారా మరియు గెలాక్సీలో సెంట్రల్ సన్ ద్వారా ప్రవహిస్తునట్టు ఊహించండి .
ఈ సమయములో మీరు పైకి మరియు క్రిందకి ప్రవహించే రెండు కాంతి స్తంభాలలో కూర్చొని ఉన్నారు.
2. లైట్ యొక్క అద్భుతమైన స్తంభం లోపల, మీ తల పైన, ధైర్యం, దయ, అంగీకారం, శాంతి, సామరస్యం, అందం మరియు హీలింగ్ లక్షణాలు కల అద్భుతమైన దైవిక శక్తి కల దేవత స్త్రీ మూర్తిని ఊహించండి.
3. ఇప్పుడు ఓంకారం పలుకుతూ, మీ శరీరంలోకి దేవత మూర్తి దిగినట్టు ఊహించండి.
మీరు మీ తలపై మీ చేతులతో ముద్రను అదే సమయంలో పెట్టి, నెమ్మదిగా క్రిందకి తీసుకుని వస్తూ మీ అనహత చక్రంపై నిలపండి. దేవత శక్తి మీ శరీరంలోకి ప్రవేశిస్తు మీ హృదయంలోకి ఏంకర్ అయినట్టు భావించండి.
4. దేవత డో ము ని పిలవండి, అలాగే ఐసిస్, మాట్, హాతోర్, క్వాన్ యిన్, మేరీ మాగ్దలీన్, వైట్ తారా వంటి అన్ని అధిరోహిత దేవతల ఉనికిని, గ్రహం మీద కొనసాగుతున్న చీకటి ఆచారాలను రద్దు చేయటానికి మరియు దైవిక కాంతిని పునరుద్ధరించడానికి మరియు న్యాయాన్ని నిలపడానికి సహాయచేయమని చెప్పండి.
5. మీ చేతులను మీ ముందుకు విస్తరించండి. దైవిక స్త్రీ శక్తిని మీ చేతుల ద్వారా ప్రతికూల ఆచారాలను తటస్థీకరిస్తూ, వాటిని ప్రమాదరహితముగా మరియు అసమర్థంగా చేస్తూ, వాటి శక్తిని కోల్పోతున్నట్టు ఊహించండి. దేవత యొక్క కాంతి మరియు ప్రేమలో అన్ని చీకటి ఆచారాలు తొలగించి వేయబడినట్టు ఊహించండి.
6. ఈ అనాచారలలో పాల్గొంటున్న వారి సోల్ స్టార్ చక్రంపై (తలపై 20 సెం.మీ. పైన) గలక్టిక్ సెంట్రల్ సన్ యొక్క కాంతి స్తంభమును ఊహిస్తూ, వారందరూ మూలచైతన్యంతో తిరిగి కనెక్ట్ అయి, ఇటువంటి అనాచారలలో పాల్గొనటాన్ని ప్రతిఘటిస్తునట్టు ఊహించండి. వారు అందరూ కాంతి కోసం పని చేయటం మొదలు పెట్టినట్టు ఊహించండి.
7. దేవతలు అందరికీ మరియు కాంతి జీవులు అందరికీ ధన్యవాదాలు, మరియు .ఇవిన్ని చేసినందుకు మీ కృతజ్ఞతను తెలపండి.
View on YouTube