శ్వాస మీద ధ్యాస పెట్టి మీ మనసును మరియు శరీరాన్ని రిలాక్స్ చేయండి
గులాబి రంగు కాంతి గాలక్టిక్ సెంట్రల్ సన్ నుండి బయలుదేరి మీ శరీరము ద్వారా; భూ మధ్య భాగమునకు చేరినట్టు ఊహించండి
ఈ కాంతి స్తంభమును కొన్ని నిముషాలు పాటు ఆక్టివ్ గా ఉంచండి
తరువాత అందమైన దేవతా రూపములో ఉన్న ప్రేమమయమైన స్త్రీ ఉనికి ఆకాశము నుండి; మీ భౌతిక శరీరములోకి ప్రవేశిస్తునట్టు ఊహించండి
ఈ ఉనికి మీ లోపలి స్త్రీ తత్వమును మరింత సామరస్యముగా మార్చి; మిమ్మల్ని మరింత ప్రేమమయముగా చేస్తుంది
ఇటువంటి ఉనికితో కొద్దిసేపు కలిసి ఉండండి
మానవత్వమునకు స్పష్టమైన; కొత్త ఆధ్యాత్మిక భవిష్యత్తును ఊహించండి. మగవారు, ఆడవారు సరిగా అర్ధము చేసుకుంటూ; భౌతిక మరియు అభౌతిక చీకటి జీవులు తొలగింపబడడము వలన మన భూగ్రహము యుద్ధము మరియు గొడవల అవసరము లేకుండా ఎదిగినట్టు ఊహించండి.
మానవులందరి గాయాలు హీల్ అయి; వారి యొక్క ఆత్మతో మరియు మూలచైతన్యము తో అనుసంధానింపబడి; స్త్రీ మరియు పురుషతత్వాల మధ్య స్పష్టమైన బాలన్స్ తో ఉన్నారు
లేచి నిల్చొండి
మీ చేతులు; మీ తల భాగము కన్నా పైకెత్తి సవ్యదిశలో అనగా clockwise దిశలో తిరగండి
ఇలా తిరుగుతున్నప్పుడు ఈ ఈ ఈ ….. అనే మంత్రము చెప్పండి. ఈ మంత్రము చెపుతున్నప్పుడు మీ శరీరము అంతా కూడా ప్రకంపిస్తూ అద్భుతమైన కాంతి స్తంభముగా మారిపోతునట్టు ఊహించండి. ఈ కాంతి స్తంభములో ఇంధ్రధనస్సు వర్ణములో ఉన్న కొన్ని మిలియన్ నక్షత్రాలు విస్తరించి ఉన్నాయి
కొద్ది నిముషాలపాటు ఈ మంత్రము చెపుతూ సవ్యదిశలో తిరగండి
తరువాత చేతులు క్రిందకు దించి శరీరానికి దగ్గరగా వుంచి సవ్యదిశలో తిరగండి
ఇప్పుడు ఏ ఆ …… అనే మంత్రము చెప్పండి. ఈ మంత్రము మీ శరీరమంతా ప్రకంపిస్తూ; మీ అనాహత చక్రము నుండి ఇంద్రధనుస్సు వర్ణముకల కాంతి వొర్టెక్స్ బయటకు వాస్తు భూగ్రహము అంతటా వ్యాపించినట్టు ఊహించండి.
మీ యొక్క ఆధ్యాత్మిక గురువుల ఉనికిని పిలవండి
అసెండెడ్ మాస్టర్లను;
ప్లయిడియన్లను
ఏంజెల్స్ ను
డాల్ఫిన్ లను
ట్విన్ సౌల్స్ ను
సౌల్ మేట్ లను
ఆత్మ కుటుంబీకులను
మరియు మిగిలిన కాంతి జీవులను ఆహ్వానించండి
మరి కొంతసేపు మంత్రము చెపుతూ ఈ అన్నీ జీవుల సమక్షములో ఉండండి
View on YouTube