మరల చర్యలు తీసుకోవలసిన సమయం
మన ప్రపంచం యొక్క గమ్యం మన చేతులలోకి తీసుకోవలసిన సమయం ఆసన్నమైంది
గ్రహ విముక్తికి చాలా సమయం పడుతున్నాది అని, మనందరం ఒప్పుకుంటున్నాం
ఈ ప్రక్రియను త్వరితం చేయడానికి, మనకి ఒక అవకాశం
21 ఆగష్టున రాబోయే సూర్య గ్రహణంను ఉపయోగించుకొని, ఒక పోర్టల్ ను సృష్టించి, తద్వారా మన చైతన్యమును ఏకం చేసి, గ్రహం చుట్టూ వున్న శక్తి క్షేత్రాన్ని ఎన్ లైట్ న్ చేద్దాం.
ప్రపంచ వ్యాప్తంగా అందరికీ తెలియపరచండి
మీ వెబ్ సైట్లలో, బ్లాగ్ లో పోస్ట్ చేయండి. ఆధ్యాత్మిక సంస్థలని మనతోపాటు కలవమని ఆహ్వానించండి
మీకు తెలిసిన ప్రత్యామ్నాయ మాధ్యమాల ద్వారా అందరికీ పంపండి
మానవ సంఘం పై, సామూహిక ధ్యానం యొక్క పాజిటివ్ ప్రభావాన్ని శాస్త్రీయ అధ్యయనాలు ధృవీకరించాయి. అందువలన ఇందులో పాల్గొనే మీ లాంటి ప్రతి ఒక్కరూ ఈవెంట్ మరియు పూర్తి సత్యం బహిర్గతమవడానిని త్వరితం చేసినవారవుతారు
ఈ ధ్యానం ద్వారా విడుదలయ్యే కాంతి శక్తిని ఉపయోగించి, కాంతి శక్తులు గ్రహంపై కాంతి గ్రిడ్ ని బలోపేతం చేయటానికి ఉపయోగిస్తారు. దీని వలన పూర్తి సత్య బహిర్గతం మరియు అసెన్షన్ ప్రక్రియ త్వరితమగును
భూ ఉపరితలంపై ఉన్న మానవులు, ఈ ప్రక్రియను త్వరితం ఆగుటకు చేయవలసింది, ఈ ధ్యానంలో పాల్గొనుట
ఈ ధ్యానం చేసేవారి సంఖ్య 144,0000కు చేరుకొనగలం
ప్రపంచవ్యాప్త శక్తి క్షేత్రంలో అతి భారీ హీలింగ్ చైన్ రియాక్షన్ సృష్టించవచ్చు.
ప్రత్యేకించి యునైటెడ్ స్టేట్స్ పై దృష్టి కలదు. ఇక్కడ అతి ఎక్కువ హీలింగ్ కావలెను
1918 తరువాత ఖండాంతర యునైటెడ్ స్టేట్స్ లో ఇటువంటి తరహా గ్రహణం మొదటిది
ఈ గ్రహణం మనకి యెకతను సృష్టించే ఒక గొప్ప అవకాశాన్నిచ్చింది
గ్రహ విముక్తిలో జాగృతమయిన వ్యక్తులు ఏకంకావడం అనేది, ఒక శక్తివంతమయిన ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది
ఈ కారణంగానే నేను, కోరిగుడ్ మరియు యెంతోమంది ప్రజలు తమ తమ శక్తులను కలిపి ఈ ధ్యానం చేసే వారి సంఖ్యను 144,000 క్రిటికల్ మాస్ తేవడానికి ప్రయత్నిస్తున్నాం
దీనికోసం కొబ్రా/కోరి యొక్క సమైఖ్య ఇంటర్వ్యూ ని రికార్డు చేశారు. దీనిని కొన్ని రోజులలో విడుదల చేస్తారు
మనమందరం ఈ ధ్యానంను 21 ఆగస్టు, సోమవారం సూర్య గ్రహణం గరిష్టంగా వుండే సమయంలో చేస్తాం. లాస్అంజిలిస్ లో 11:11 am, కైరోలో 8:11 pm EET, ప్యారిస్లో 8:11 pm CEST, లండన్ లో 7:11 pm BST, న్యూయార్క్ లో 2:11 pm EDT, చికాగొ లో 1:11 pm CDT, డెన్వర్లో 12:11 pm MBT, ఇండియాలో 11:41 pm IST మరియు తైపే లో 22 ఆగస్టు, మంగళవారం నాడు 2:11 am
మీ ప్రదేశం యొక్క సమయమును ఇక్కడ సరిచూసుకోగలరు
సూచనలు:
1) మీ యొక్క సొంత పద్దతిని ఉపయోగించి మిమ్మల్ని మీరు ప్రశాంత చైతన్యపు స్థితికి తీసుకురండి
2) మీ యొక్క సంకల్పన్ని తెలియపరచండి. ఇప్పుడు జరుగుతున్న ధ్యానం ఒక సాధనంగా ఉపయోగపడి భూమి మరియు భూ మానవులకి సామరస్యం మరియు ఏకతను తెచ్చే ప్రక్రియ త్వరితమవ్వలి
3) గలక్టిక్ సెంట్రల్ సన్ ద్వారా ఒక కాంతి స్థంభం విడుదలై, సౌర వ్యవస్థలోని అన్ని కాంతి జీవులద్వారా ప్రవహిస్తూ
గ్రహణ సూర్యుని ద్వారా మరియు చంద్రుని ద్వారా ప్రవహిస్తూ మీ శరీరం ద్వారా భూమధ్య భాగానికి చేరుకుంది
అలాగే భూ మధ్య భాగం నుండి మరియొక కాంతి స్తంభం బయలుదేరి, మీ శరీరం ద్వారా ఆకాశం లో పైకి ప్రవహిస్తూ మన సౌర వ్యవస్థ మరియు గెలాక్సీ లోని అన్ని కాంతి జీవులకి వెలుతున్నది
ప్రస్తుతం కూర్చునివున్న మీ లోంచి రెండు కాంతి స్తంభాలు ప్రవహిస్తున్నాయి. ఒకేసారి పైకి ప్రవహించే కాంతి మరియు క్రిందకి ప్రవహించే కాంతి
ఈ కాంతి స్తంభాలని కొద్ది నిముషాల పాటు ఆక్టివ్ గా వుంచండి.
4) ఇప్పుడు సున్నితమైన పింక్ హీలింగ్ దైవిక స్త్రీ శక్తి, గ్రహ జనాభాలో వున్న అన్ని గాయాలని హీల్ చేస్తూ, శాంతిని, సామరస్యమును, అర్ధం చేసుకొనే తత్వమును, అనంతత్వమును మరియు ఏకతను తీసుకువస్తుంది
కొత్త భూమి సృష్టి కోసం లైట్ వొర్కెర్లు, కాంతి యోధులు మరియు సత్యం బహిర్గతం చేసేవారందరు సమైక్యంగా కృషి చేస్తున్నట్లు ఊహించండి
మనయొక్క కొత్త వాస్తవికతను సృష్టించటంలో భూ మానవులు ఆనందంగా పాలుపంచుకుంటూ, సంబరాలు జరుపుకుంటున్నారు. ఎవరికి యేమి కావాలన్నా అది సృష్టించికుంటూ మరియు ఎవరికి నచ్చినట్లు వారు జీవిస్తున్నారు
ఈ ధ్యానం కనీసం 15 నిమిషాలు చేయండి
దేవతకు ఏకత కావాలి మరియు అంతటా ఏకతే
ఈ యూనిటీ ధ్యానం తాలూకా అప్డేట్ ల కోసం: