రిటర్న్ ఆఫ్ లైట్ అక్టివేషన్ గైడెడ్ ధ్యానము 21-01-2019 / Return of Light Activation (Telugu)

21-01-2019, 10:41 am [IST]

మీ సొంత పద్దతిని ఉపయోగించి ప్రసాంతమైన చైతన్య స్థితికి రండి
మీ సంకల్పాన్ని ఈ విధముగా తెలపండి. ఇప్పుడు జరుగుతున్న ధ్యానము ను
ఒక సాధనముగా ఉపయోగించి గ్రహ ఉపరితలము మీదకి కాంతి ని తేవాలి
కాస్మిక్ సెంట్రల్ సన్ నుండి ఒక తెల్లని అద్భుతమైన కాంతి
వెదజల్లబడుతున్నట్టు ఉహించండి. ఈ కాంతి విశ్వములోని అన్ని గాలక్సీ ల
సెంట్రల్ సన్ లకు వ్యాప్తి చెందుతున్నది
ఈ కాంతి గాలక్టిక్ సెంట్రల్ సన్ ద్వారా ప్రసరిస్తూ
అల్ సియోన్ ప్లేయాడియన్ నక్షత్ర ద్వారము ద్వారా వెళుతూ
సిరియస్ నక్షత్ర ద్వారము ద్వారా ప్రయాణిస్తూ
ఇప్పుడు మన సౌర వ్యవస్థ లోకి ప్రవేశించి, సౌర వ్యవస్థ లోని అన్ని
కాంతి జీవుల ద్వారా ప్రయాణిస్తూ
భూమి మీద అన్ని జీవుల ద్వారా ప్రయాణిస్తూ
మరియు మీ శరీరము ద్వారా ప్రయాణిస్తూ భూ మధ్య భాగమును చేరినట్టు ఉహించండి
ఈ కాంతి విశ్వములోని మిగలిన చీకటి అంతటిని రూపాపరివర్తన చేస్తూ,
కాంతి మాత్రమే మిగ్లినట్టు ఉహించండి
ఒక కొత్త కాస్మిక్ సైకిల్ మొదలు అయినట్టు ఉహించండి, దీని ద్వారా
విశ్వములో ఉన్న అన్ని జీవులకి స్వచ్చమైన కాంతి, ప్రేమ మరియు సంతోషము
తీసుకురాబడుతునాయి
లేచి నిల్చోండి. మీ చేతులను మీ తల భాగము కన్నా పైకి ఎత్తి మీరు
సవ్యదిశలో తిరగడము మొదలు పెట్టండి.
ఇలా తిరుగుతున్నప్పుడు ఈ ఈ ఈ ….. అనే మంత్రము చెప్పండి. ఈ
మంత్రము చెపుతున్నప్పుడు మీ శరీరము అంతా కూడా ప్రకంపిస్తూ అద్భుతమైన
కాంతి స్తంభముగా మారిపోతునట్టు ఊహించండి. ఈ కాంతి స్తంభములో ఇంధ్రధనస్సు
వర్ణములో ఉన్న కొన్ని మిలియన్ నక్షత్రాలు విస్తరించి ఉన్నాయి
కొద్ది నిముషాలపాటు ఈ మంత్రము చెపుతూ సవ్యదిశలో తిరగండి
తరువాత చేతులు క్రిందకు దించి శరీరానికి దగ్గరగా వుంచి సవ్యదిశలో తిరగండి
ఇప్పుడు ఏ ఆ …… అనే మంత్రము చెప్పండి. ఈ మంత్రము మీ శరీరమంతా
ప్రకంపిస్తూ; మీ అనాహత చక్రము నుండి ఇంద్రధనుస్సు వర్ణముకల కాంతి
వొర్టెక్స్ బయటకు వస్తు భూగ్రహము అంతటా వ్యాపించినట్టు ఊహించండి.
ఈ ఇంద్రధనుస్సు వొర్టెక్స్ మీ యొక్క ట్విన్ సోల్ స్ కు, సోల్ మేట్
లకు, ఆత్మ కుటుంబికులకు, మీ యొక్క ఆధ్యాత్మిక మార్గదర్సకులకు, అసెన్డెడ్
మాస్టర్ లకు, ప్లేయాడియన్ లకు, ఏంజెల్ స్ కు, డాల్ఫిన్ లకు మరియు ఇతర
కాంతి జీవులకు పిలుపు ఇస్తునట్టు ఉహించండి
మీ యొక్క ట్విన్ సోల్ స్, మీ యొక్క సోల్ మేట్లు మరియు ఆత్మ
కుటుంబీకులు జాగ్రుతపరచబడి మరియు మీ తో కలసి పోయి, కాంతి మండలా లో ఒక
జీవిగా మారినట్టు విజువలైజ్ చేయండి.

View on YouTube

Leave a comment

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.